ఆ మూడుతో ఆపేస్తారా!

Update: 2024-06-14 16:37 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంతి పవన్ కళ్యాణ్ ఇక నుంచి పాలనపై ఫోకస్ పెడతారా?. లేకపోతే ఒక వైపు పాలనతో పాటు మరో వైపు తన ప్రధాన వ్యాపకం అయిన సినిమాలు కూడా చేస్తారా?. ఇదే ఇప్పుడు టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజి లో ఉన్నాయి. ఇప్పటికే మొదలు అయిన ఈ సినిమాలు చేసి బ్రేక్ ఇస్తారా..లేక రాబోయే రోజుల్లో కూడా కొత్త సినిమాలు ఓకే చేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో ముఖ్యమంతులుగా ఉన్న వాళ్ళు కూడా సినిమాలు చేశారు. కానీ అప్పటి పరిస్థితులు వేరు..ఇప్పుడు వేరు . అటు సినిమాలు..ఇటు పాలనను బ్యాలన్స్ చేయటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు.

                                                                                 మరో వైపు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచి ఉప ముఖ్యమంతి పదవితో పాటు కీలకమైన పంచాయతీరాజ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖలు దక్కించుకున్నారు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేయాలంటే దీనిపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. ఈ ఎన్నికల్లో జన సేన సంచలన విజయాన్ని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ ను అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయం అని వైసీపీ నేతలు సవాళ్లు విసిరితే పవన్ కళ్యాణ్ ఒక్క్కరే కాదు..తనతో పాటు మరో ఇరవై మందిని జన సేన ఎమ్మెల్యేలను కూడా ఆయన అసెంబ్లీ లోకి తీసుకువెళుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో భాగస్వాములు కూడా అయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News