ఎన్నికల వేళ పవన్ కీలక నిర్ణయం

Update: 2024-03-26 14:17 GMT

Full Viewసార్వత్రిక ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సంపాదనలో నుంచి పది కోట్ల రూపాయలను పార్టీ కి విరాళంగా ఇచ్చారు. సినిమాల్లో నటించినందుకు వచ్చిన రెమ్యూనరేషన్ నుంచి ఈ మొత్తం పార్టీ కి చెక్ రూపంలో అందచేశారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు గారి సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి‌.రత్నం కి విరాళం చెక్కులను అందజేశారు. సినిమాల ద్వారా వస్తున్న తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకే కాకుండా సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు పవన్ కళ్యాణ్ విరాళాలు ఇస్తున్నట్లు జనసేన వెల్లడించింది.

                               జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి దగ్గర నుంచి ఎంతో మంది తమ వంతు సాయం అందిస్తున్నారు అని తెలిపారు. వాళ్ళు అంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. అలాంటి వారి స్ఫూర్తితో తాను కూడా సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 

Tags:    

Similar News