హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

Update: 2025-11-23 07:01 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇటీవల పలు కార్పొరేషన్ లకు నూతన చైర్మన్లను నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన పదవి ఒకటి ఉంది. అదేంటి అంటే ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పదవి. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పదవిని పి. విజయబాబు నిర్వహించారు. ఆయన పలు వివాదాలకు కూడా కారణం అయ్యారు. ఎవరూ చేయని రీతిలో అధికార భాషా సంఘం లెటర్ హెడ్ పై ఏకంగా అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో కూడా ముద్రించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నియమించిన పోస్ట్ ల్లో అధికార భాషా సంఘం చైర్మన్ పదవి కూడా ఉంది. ఈ పదవిని తెలుగు దేశం సారథ్యంలోని కూటమి సర్కారు విక్రమ్ పూలా కు కేటాయించింది. విక్రమ్ ఎవరో కాదు...స్వయానా గత చైర్మన్ విజయబాబు సోదరుడు.

                                             అయితే విక్రమ్ గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీ తో కలిసి కొనసాగుతున్నారు మధ్యలో కొన్ని రోజులు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం వైపు వెళ్లారు..ఆయన కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలో కూడా చిరంజీవి దగ్గర పని చేశారు. తిరిగి మళ్ళీ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పై ముద్రించిన పుస్తకాలతో పాటు ఇతర పార్టీ వ్యవహారాల్లో కూడా కీలక భాగస్వామి అయ్యారు. ఇప్పుడు ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పదవి ఇవ్వటంతో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ఏదైనా ఈ పదవి మాత్రం ఆ ఫ్యామిలీ కేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది.

Tags:    

Similar News