వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకతను తమ రెండు పార్టీలు ఉపయోగించుకుంటాయన్నారు. లక్ష్మణ్ ప్రకటనతో కొంత కాలం పాటు ఈ పొత్తు ప్రచారానికి పడినట్లే అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల నాటికి కూడా ఖచ్చితంగా ఇదే పరిస్థితులు ఉంటాయని చెప్పటానికి వీల్లేదు. ఎవరు..ఎప్పుడు ఎవరితో కలుస్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందనే విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయబోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు. లక్ష్మణ్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేనలు మాత్రమే ఏపీలో కలసి పోటీచేస్తే ఈ రెండు పార్టీలు కలసి సాధించే సీట్లు కూడా ఏమీ ఉండవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటి బలం చాలా పరిమితం అన్న విషయం తెలిసిందే. అయితే వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా జనసేనను బిజెపినే టీడీపీతో పొత్తు కుదుర్చుకోకుండా చేయవచ్చనే అనుమానాలు కూడా టీడీపీ నేతల్లో ఉన్నాయి. మరి ఎన్నికల నాటికి ఎన్ని మార్పులు వస్తాయో వేచిచూడాల్సిందే.