ఈ వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చిందని తెలిపారు. ఆగస్టు 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వీడియో అప్‌లోడ్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమన్నారు. ఈ వీడియోపై ఎంపీ మాధవ్ స్వయంగా తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.