సహజంగా మార్కెట్లో అది కీలక ఛానల్ కావటంతో కొంత రీచ్ ఎక్కువగానే ఉంటుంది. ఆ పార్టీ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇలా పెయిడ్ న్యూస్ పోయి ఇప్పుడు కొత్తగా ఏకంగా కాంట్రాక్ట్ ఛానళ్ళే పుట్టుకొచ్చాయని చెబుతున్నారు. అంతే కాదు..రాష్ట్రంలో టాప్ ఛానళ్లు..పత్రికలు తమకు అస్మదీయులైన బడాబడా కాంట్రాక్టర్లకు చెందిన వార్తలు అసలు కన్పించనీయకుండానే చేస్తారు. కాంట్రాక్టర్లే కాదు..రాజకీయ నేతల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తాము మోస్తున్న పార్టీ నేతలకు సంబంధించి పెద్ద వ్యతిరేక వార్తలు వచ్చినా వారు వాటిని చూసీ చూడనట్లుగానే వదిలేస్తున్నారు. ఇలాంటి వాటికి చాలాసార్లు సోషల్ మీడియానే ఆయుధంగా మారుతోంది. సోషల్ మీడియాలో ఉండే అరాచకం ఉన్నా కూడా లూటీ చేస్తున్న నేతలు..కాంట్రాక్టర్లకు సంబంధించిన అక్రమాలు ఇక్కడ మాత్రమే వెలుగుచూస్తున్నాయి. అయితే మీడియాను తమకు అనుకూలంగా వాడుకోవటంలో ఏ పార్టీ కూడా తక్కువేమీ కాదనే చెప్పొచ్చు.మిగిలిన ఛానళ్లు కూడా ఎవరి ఏజెండా ప్రకారం వాళ్లు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా అందరూ కలసి చేసేది ప్రజల ఏజెండాను వదిలేసి..పార్టీల ఏజెండాలను మోయటమే.