తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళవారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2022లో జమిలీ ఎన్నికలు వస్తే జగన్ ఇక ఇంటికే అని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలు విన్న లోకేష్ మాట్లాడుతూ .. ''నేను చూశాను.. నేను విన్నాను అన్న వచ్చాడు.. అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఏమి పీకాడు..ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గాల్లో తిరుగుతాడు.. వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డాన్సులు చూస్తాడు. ఏపీలో ఇంత దరిద్రపు పాలన ఎప్పుడు చూడలేదు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రశ్నిస్తే అప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు విడుదల చేశారు. వీళ్లకు రికార్డింగ్ డాన్సులు చూడటానికి సమయం ఉంటుంది కానీ రైతుల గురించి పట్టించుకోవటానికి సమయం లేదు.
రైతు రాజ్యం అని చెప్పుకునే వైసీపీ నేతలు గ్రామాల్లో రౌడీ రాజ్యం స్థాపిస్తున్నారు..ముళ్ళు కర్రతో కొడితే కానీ ముఖ్యమంత్రి కదిలేలా లేరు..పాదయాత్రలో పెంచుతూ పోతా అన్న ముఖ్యమంత్రి.. సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటే అన్నీ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యమంత్రి రైతుల పొలాలకు మీటర్లు పెడితే ఆ షాక్ మీకే కొడుతోంది..గతంలో రైతులకు డ్రిప్, స్ప్రేయర్, విత్తనాలు ఏవి కావాలన్నా అడగకుండానే వచ్చేవి.. ఇప్పుడు మొత్తుకున్నా ఏవి దొరకటం లేదు..ముఖ్యమంత్రిగా జగన్ వచ్చిన తర్వాత 30 ఏళ్లలో రైతులు ఎప్పుడు చూడని నష్టాన్ని చూశారు.. అంత దరిద్రపు పాదం ఆయనది..అధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పటం.. మడమ తిప్పటం తప్ప ఆయన చేసిందేమీ లేదు' అని విమర్శించారు.