ప్రముఖ నటుడు మోహన్ బాబు గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే శ్రీ విద్యానికేతన్ పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ఆయన కొత్తగా మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబియు)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీవిద్యానికేతన్ లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయన్నారు.
30 సంవత్సరాల నమ్మకంతో కొత్తదనంతో పలు అంశాలు నేర్చుకునేందుకు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయంలో కూడా గతంలో లాగే మీ ప్రేమ, అభిమానం కొత్త ప్రాజెక్టుకు కూడా దక్కుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. తల్లి, దండ్రులు, తన అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు.