జనసేనకు మాదాసు గంగాధరం గుడ్ బై

Update: 2021-04-11 17:01 GMT

జనసేనకు మరో నేత గుడ్ బై చెప్పారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. గతంలో తనకు పార్టీలో దక్కన గౌరవం ఇప్పుడులేదని..గత కొంత కాలంగా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించనందున పార్టీలో ఉండి ఉపయోగం లేదని భావించినట్లు తన లేఖలో పేర్కొన్నారు. తన లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 'పవన్ పోటీ చేసిన గాజువాకలో స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు పవన్ అండగా నిలవలేకపోతున్నారు. సినిమా ప్రపంచం వేరు.. రాజకీయం ప్రపంచం వేరు. రెండింటికీ తేడా తెలియని మీతో పని చేయలేను. పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి పెట్టడం లేదు.

ప్రజలు కోరుకున్నట్లు జనసేన పనిచేయడం లేదు. పవన్‌ నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని పవన్ ఎప్పుడూ ఖండించలేదు. మౌనం అర్ధాంగీకారం అనే భావన అందరిలో నెలకొంది. వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని విమర్శలు చేశారు. కేంద్రం పరిధిలో పనిచేసే సీబీఐ దర్యాప్తును ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది?.' అని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. మాదాసు గంగాధరం జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జనసేన ఎలక్షన్ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఎన్నికల అనంతరం తాను ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి తీరు కూడా ఏ మాత్రం సరిగాలేదన్నారు.

Tags:    

Similar News