ఇది ఆ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చేసినా కామెంట్. బీజేపీ కి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీ కి రాజీనామా చేసిన తర్వాత చేసిన వ్యాఖలు కూడా దీనికి బలం చేకూర్చేలా ఉన్నాయనే చెప్పొచ్చు. కన్నా గత కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ బీజేపీ నేతలు, అధికార వైసీపీ తో కలిసి పనిచేస్తున్నారు అని కన్నా సంచలన వ్యాఖలు చేశారు. ఈ విషయాన్నీ తాను కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని తెలిపారు. పిలిచి మాట్లాడతామన్నారు కానీ...ఏమి జరగలేదు అని అయన చెప్పకనే చెప్పారు. బీజేపీ కి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత కన్నా ఒక ఛానల్ తో మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ తో కలిసి పని చేస్తున్నట్లు చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . కన్నా లక్ష్మినారాయణ మాటలు చూస్తే అధికార వైసీపీ తో బీజేపీ కలిసి ఉంది అనే సంకేతాలు ఇచ్చారు. కన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో వైసీపీ పై చాలా దూకుడుగా విమర్శలు చేసేవారు. కానీ ఎప్పుడు అయితే సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచే అంతా చల్లబడింది అని చెప్పొచ్చు. కన్నా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అధికార వైసీపీ అయన పై తీవ్ర విమర్శలు చేసింది. చంద్రబాబు తో కలిసి పని చేస్తున్నారని...టీడీపీ అజెండానే కన్నా మాట్లాడుతున్నారు అంటూ వైసీపీ ఎటాక్ చేసింది అప్పటిలో.
ఇప్పుడు సోము వీర్రాజు అయినా, ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అయినా వైసీపీ పై విమర్శలు చేస్తున్నా అది ఏదో చేయాలి కాబట్టి చేసినట్లు తప్ప సీరియస్ నెస్ ఎక్కడా కనిపించదు. అయితే ఇది అంతా వీళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు అనటానికి లేదు అని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. పై నుంచి వచ్చే డైరెక్షన్ ప్రకారమే వీళ్ల్లు నడుస్తున్నారు అన్నారు. లేక పోతే తెలంగాణ బీజేపీ దూకుడు, ఏపీ బీజేపీ పనితీరు చూసుకోవచ్చు అని అయన పోల్చారు. ఇటీవల ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చిన సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలు చాలా మంది అధికార వైసీపీ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఇచ్చే ప్రయత్నం చేసినా మోడీ స్పందన చూసి ఇది ఇక అయ్యే పని కాదులే అని వెనక్కి తగ్గినట్లు ఒక సీనియర్ నేత వెల్లడించారు. అదే సమయంలో మోడీ ఇచ్చిన క్లారిటీతోనే బీజేపీ తో ఉంటే ఇక కష్టం అని పవన్ కళ్యాణ్ కూడా క్రమక్రమంగా టీడీపీ వైపు జరగటం స్టార్ట్ చేసినట్లు చెపుతున్నారు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే పైకి ఏమి మాట్లాడినా ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ, బీజేపీ లు అంతర్గత అవగాహనాతో సాగుతున్నాయనేది పక్కా అని ఒక కీలక నేత స్పష్టం చేశారు .