ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

Update: 2021-03-10 05:14 GMT

ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపిక చేసిన కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన ద్వారానే వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ కి విజయవాడ 9వ డివిజన్ పరిధిలో ఓటు ఉంది.

బుదవారం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు పటమట లంకలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా గుర్తు ఉన్న వేలును చూపి అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు.

Tags:    

Similar News