జగన్ పై మోడీ టీం స్పెషల్ కేర్ !

Update: 2024-04-24 01:02 GMT

గుజరాత్ లో మద్యం అమ్మరు. అయినా ఆ రాష్ట్రం నంబర్ వన్ గా ఉంది. మద్యం ఆదాయం మీద ఆధారపడి చంద్రబాబు ప్రభుత్వం నడపటం సిగ్గుచేటు. ఈ పద్ధతి మారాలి. తాము అధికారంలోకి వస్తే ఏదో ఫైవ్ స్టార్ హోటల్స్ లో మద్యం ఉన్నా పర్వాలేదు కానీ..రాష్ట్రంలో అసలు మద్యం అనేదే లేకుండా చేస్తాం. ఇవీ ప్రతిపక్షంలో ఉండగా జగన్ చెప్పిన మాటలు.సీన్ కట్ చేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు స్టార్ట్ చేయించారు. అంతకు ముందు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం షాప్ లు పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. అదే సమయంలో గతం కంటే ఇప్పుడు జగన్ సర్కారు హయాంలో మద్యం అమ్మకాలు కొత్త కొత్త రికార్డు స్థాయికి చేరాయి. అంతే కాదు..అసలు ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఆధారపడటం మాత్రమే కాదు...మద్యం పై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది అంతా ఒకెత్తు అయితే ఆంధ్ర ప్రదేశ్ మద్యం షాప్ ల్లో సాగుతున్న తంతు మరీ వెరైటీ అనే చెప్పాలి. చిలక జోస్యం చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ తో చెల్లింపులు అనుమతిస్తున్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ అంతగా పాపులర్ అయ్యాయి. చాలా మంది జేబులో నగదు పెట్టుకోకుండానే ఫోన్ తోనే అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని లిక్కర్ షాప్ ల్లో మాత్రం నగదు తప్ప ..డిజిటల్ పేమెంట్స్ అనుమతించరు.

                                                         అది వెయ్యి రూపాయలు అయినా...పది వేలు అయినా అక్కడ నగదు కట్టాల్సిందే. లేక పోతే మందు అమ్మరు. అవి ప్రభుత్వం నడిపే షాప్ లు. గత కొన్ని సంవత్సరాలుగా జగన్ సర్కారు ఏపీలో ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. ఢిల్లీ లోని కేజ్రీవాల్ సర్కారు లిక్కర్ పాలసీ మార్చి కొంత మందికి ప్రయోజనం కల్పించేలా వ్యవహరించేందుకు వంద కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అని సిబిఐ, ఈడీలు కేసు లు పెట్టి ఏకంగా ఇటీవలే ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఉప ముఖ్యమంత్రి గా ఉన్న మనీష్ సిసోడియా ను కూడా ఇదే కేసు లో అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు. ఇదే కేసు లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో నిజాలు నిజాలు ఏంటో ఇక ఇప్పుడు కోర్టు లో తేలాల్సిందే. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విషయంలో ఇంత కఠినంగా వ్యవరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు..ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ పాలసీ విషయంలో మాత్రం కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా ఆంధ్ర ప్రదేశ్ లోని లిక్కర్ బ్రాండ్స్..నగదు పే మెంట్స్ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏకంగా సిబిఐ కి ఫిర్యాదు కూడా చేశారు.

                                                                 కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి మరీ ఆధారాలతో ఒక నివేదిక అందచేశారు. అయినా కూడా కేంద్రం ఈ విషయంలో అసలు జగన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ముఖ్యంగా ఆమె ఉదాహారణలతో సహా వివరించారు. ప్రభుత్వం నడిపే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక లిక్కర్ షాప్ లో లక్ష రూపాయల అమ్మకాలు జరగ్గా..కేవలం 700 రూపాయలు మాత్రమే డిజిటల్ పే మెంట్స్ జరిగినట్లు వెల్లడించారు. ఇది జరిగింది 2023 అక్టోబర్ లో. కానీ చర్యలు శూన్యము. జగన్ పలు అంశాల్లో ప్రతిపక్షంలో ఉండగా చెప్పింది ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది మరొకటి. అందులో మద్యం విధానం ఒకటి. ఈ నగదు లావాదేవాలతో మద్యం విషయంలో భారీ గోల్ మాల్ జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి. అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు ఎవరికీ అందాల్సినవి వాళ్లకు అందుతున్నందునే ఎవరూ నోరు మెదపటం లేదు అనే అభిప్రాయం అధికార వర్గాల్లో కూడా ఉంది.

Tags:    

Similar News