ఏపీ సీఎం జగన్ కొత్త రికార్డు!

Update: 2023-12-29 12:01 GMT

Full Viewబహుశా దేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా తన పేరు తాను అన్ని సార్లు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పుకొని ఉండరు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఒక కొత్త రికార్డు సృష్టించారు అనే చెప్పాలి. అది ఎలాగంటే అయన భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు పేర్లు పెట్టుకుంటున్నారు అని విమర్శించిన నేతలే...వైసీపీ అధికారంలో వచ్చాక ప్రతి పధకానికి జగన్ తన పేరు తగిలించుకుంటున్న విషయాన్నీ మాత్రం మర్చిపోయారు అనే చెప్పాలి . అయితే జగన్ ఇక్కడ చెప్పింది ఆ పేర్ల గురించి కూడా కాదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ ఏమి చూసినా జగన్ పేరు తప్ప మరొకటి గుర్తు రాదు అంటూ తన ప్రసంగంలోని జగన్ తన పేరును ఎన్ని సార్లు చెప్పారో లెక్కే లేదు. రాష్ట్రంలో కట్టిన గ్రామ సచివాలయాలను చూసినప్పుడు గుర్తుకు వచ్చేది జగన్..పెన్షన్ చేతిలో పెడుతున్నప్పుడు కూడా మీ జగన్ గుర్తుకు వస్తాడు.

                          రైతన్నల చేయి పట్టుకు నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకు వచ్చింది ఎవరు అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్, పేదల ఖాతాల్లో డబ్బులు పంపింది ఎవరు అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్ లు ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి ..విప్లవాత్మక మార్పులతో విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అంటే...వాటిని చూసినప్పుడు గుర్తుకు వచ్చేది జగన్, గ్రామ గ్రామాన మహిళా పోలీసులు...దిశా యాప్ ను చూసినప్పుడు గుర్తికు వచ్చేది మీ జగన్. ఇలా జగన్ తన పేరు తాను ఈ సమావేశంలో ఎన్నిసార్లు చెప్పుకున్నారో లెక్కే లేదు. జగన్ నోట చంద్రబాబు...పవన్ కళ్యాణ్ ల పేర్లు రావటం వింతేమీ కాదు...వాళ్లపై విమర్శలు కొత్తేమీ కాదు. కానీ జగన్ నోట...జగన్ పాటే వెరైటీ అని చెప్పుకోవచ్చు. జగన్ మాటలు చూసినా వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ఏ గుంతల రోడ్లు చూసినా కూడా తానే గుర్తుకు వస్తానని చెప్పి ఉండాల్సింది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Tags:    

Similar News