తిరుపతిలో ఫేక్ ఓటర్ ఐడీ కార్డుల కలకలం!

Update: 2021-04-17 05:16 GMT

తిరుపతిలో కలకలం. లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున నగరంలోకి స్థానికేతరులు రావటం, వారి వద్ద స్టిక్కర్లు అంటించిన ఓటర్ కార్డులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. వీరిని ఎక్కడికి అక్కడ అడ్డుకుని టీడీపీ శ్రేణులు మీడియా ముందు ఉంచాయి. అయితే ఎక్కువ మంది పొంతన లేని సమాధానాలు చెబుతూ వెళ్లిపోతున్నారు. బస్సుల్లో పలువురు తిరుపతిలోకి వచ్చి కళ్యాణ మండపాల్లో ఉంచారని..ఇది అంతా దొంగ ఓట్లు వేయించేందుకే అని టీడీపీ ఆరోపిస్తోంది.

కొంత మంది నేతలు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు కూడా దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో 144 సెక్షన్ ఉన్నా ఇంత పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రజలను ఎలా అనుమతించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదే సమయంలో కొంత మంది తమ ఓట్లను ఎవరో వేశారని..ఫోటోతో కూడిన ఓటర్ గుర్తింపు కార్డు తమ దగ్గర ఉంటే..తమ ఓట్లు వేరే వాళ్లు ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News