జగన్ బాధ కూడా కెసిఆరే పడుతున్నారే!

Update: 2022-11-16 10:00 GMT

Full Viewఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తో తన బంధం రాజకీయాలకు అతీతం అని ప్రకటించారు. ఇటీవల జరిగిన వైజాగ్ సభలో జగన్, మోడీతో తన అనుబంధానికి పర్సనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. విచిత్రం ఏమిటి అంటే అంతకు ముందే తెలంగాణ సీఎం కెసిఆర్ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఘటనకు సంబంధించి మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా ఏపీలో కూడా బీజేపీ కుట్ర చేస్తోందని, వైసీపీ ఎమ్మెల్యేలను కూడా కొనాలని చూశారని.ఆంధ్ర ప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఇలాంటి పనులు చేయటానికి ఈ గ్యాంగ్ సిద్ధం అయింది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాతే మోడీ ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించారు..ఆయనపై జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. అంటే సీఎం కెసిఆర్ చెప్పిన మాటలను అటు సీఎం జగన్, ఇటు వైసీపీ నాయకులూ ఎవరూ నమ్మటంలేదా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. జగన్ కు ఇంత ఓపెన్ గా సీఎం కెసిఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై మాట్లాడినా కూడా వైసీపీ ఈ విషయాన్నీ ఏ మాత్రం పట్టించోకోలేదు.

                                                సహజంగా అధికారంలో ఉన్న పార్టీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతటి కీలక విష్యం చెపితే జగన్ లైట్ తీసుకోవటం ఎలా చూడాలి అన్న చర్చ రాజకీయ నేతల్లో ఉంది. ఈ అంశంపై వైసీపీ ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే ఇది నిజం కాదు అని అయినా భావించాలి..లేక పోతే తమ ఎమ్మెల్యేలు ఎక్కడికి పొరనే ధీమా అయినా అయి ఉండాలి. తాజాగా మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మరో సారి కెసిఆర్ ఆంధ్ర ప్రదేశ్ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో జగన్ పెద్ద పోరాటం చేసి ముఖ్యమంతి అయ్యారు. అయన సహాయాన్ని బీజేపీ, కేంద్రం మొదటి నుంచి తీసుకుంటున్నాయి.. ఇప్పుడు జగన్ పార్టీ కి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను గుంజాలని స్కెచ్ వేసిన బీజేపీ వాళ్ళను ఏమి అనాలని ఆవేదనతో ప్రశ్నించారు అట. నిజముగా జగన్ తన సొంత ఎమ్మెల్యేలు 70 మందిని బీజేపీ అయినా..మరో పార్టీ అయినా తీసుకోవాలని చూస్తే వాతావరణం అంత కూల్ గా ఉంటదా. ఈ వ్యవహారం చూస్తున్న వారంతా జగన్ బాధ కూడా కెసిఆరే పడుతున్నట్లు ఉన్నట్లు ఉందని అంటున్నారు.

Tags:    

Similar News