లిక్కర్ స్కాం లో ఈడీ దూకుడు

Update: 2026-01-19 04:25 GMT

ఫస్ట్ విజయసాయి రెడ్డికి. ఆ మరుసటి రోజే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. వరసపెట్టి ఇలా ఈడీ నోటీసు లు జారీ చేస్తుండంతో ఈ కేసు లో ఏదో జరగబోతుంది అన్న అనుమానాలు వస్తున్నాయివైసీపీ నేతల్లోనే. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం వ్యవహారం పూర్తిగా మరుగునపడిపోయింది. ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ తన విచారణ ముగించినా కూడా కూడా ఇందులో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు అనే పేరున్న వాళ్ళ వైపు కన్నెత్తి చూడకపోవటం కూడా అధికార టీడీపీ లోనే తీవ్ర చర్చకు దారితీసింది. కొంత మంది టీడీపీ సోషల్ మీడియా అభిమానులు ఇదే అంశంపై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ కూడా పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు సడన్ గా ఈడీ ఈ విషయంలో స్పీడ్ పెంచటంతో ఇందులో కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం లో కీలక విషయాలు బయటపెట్టిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కి ఇప్పటికే ఈడీ నోటీసు లు జారీ చేసి జనవరి 22 న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

                                             ఇప్పుడు ఆ మరుసటి రోజే అంటే జనవరి 23 న హాజరు కావాల్సిందిగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి ఈడీ నోటీసు లు జారీ అయ్యాయి. అంటే విజయసాయిరెడ్డి ని విచారించిన మరుసటి రోజే ఎంపీ మిథున్ రెడ్డి ని కూడా పిలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే కేసు లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయి జైలు కు వెళ్లి..బెయిల్ పై బయటకు వచ్చారు. లిక్కర్ స్కాం నగదు లో కొంత మొత్తం నేరుగా మిథున్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన కంపెనీల్లోకి వెళ్లాయని సిట్ ఆరోపిస్తోంది. తెలుగు దేశం నాయకులు కూడా ఇదే అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కాం లో హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో భారీఎత్తున అక్రమాలు జరిగినట్లు మొదటి నుంచి ప్రచారం ఉంది. ఇప్పుడు ఈడీ వీటిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి ఆస్తులను సైతం ప్రభుత్వానికి అటాచ్ చేశారు. ఇలా ఈడీ వరస నోటీసు లు జారీ చేసిన విచారణ జరిపిన తర్వాత ఏమైనా చర్యలు ఉంటాయా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం.

Tags:    

Similar News