రేషన్ సరఫరా వాహనాలను ప్రారంభించిన జగన్

Update: 2021-01-21 12:06 GMT

ఇంటింటికి రేషన్ సరుకులను చేర్చేందుకు వీలుగా మొబైల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 2500 వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ లో సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. వీటితోపాటు బ్యాగులను కూడా రేషన్ పొందేవారికి ఉచితంగా అందించనున్నారు.

వాటిని కూడా జగన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు.

Tags:    

Similar News