విజయవాడలో ఆలయాల పునర్ నిర్మాణానికి జగన్ భూమి పూజ

Update: 2021-01-08 06:44 GMT

విజయవాడలోని కృష్ణా నది తీరంలో ఉన్న తొమ్మిది ఆలయాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలగించారు. పుష్కరాల సమయంలో వీటిని పడగొట్టారు. ఇప్పుడు ఏపీలోని వైసీపీ సర్కారు గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 గుడులను పునఃనిర్మించే పనులను ప్రారంభించింది. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. శుక్రవారం మంచి రోజు కావటంతో ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. 77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దుర్గ గుడి విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రస్తుతం దేవాలయాల్లోని విగ్రహాలపై దాడులు జరుగుతున్న తరుణంలో కొత్త ఆలయాల పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

Tags:    

Similar News