మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు

Update: 2021-03-17 08:19 GMT

అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీసీఐడీ దూకుడు పెంచింది. మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చిన సీఐడీ బుధవారం నాడు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ లోని నారాయణ నివాసంలో ఈ నోటీసులు అందించారు. నారాయణ అందుబాటులో లేకపోవటంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు ఇచ్చారు. మార్చి 22న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో భాగంగా తాజాగా నారాయణ విద్యాసంస్థలు, ఆఫీసుల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో సీఐడీ సోదాలు నిర్వహిస్తూ...ఏకకాలంలో పది ప్రాంతాల్లో సీఐడీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. రాజధాని భూముల విషయంలో నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసైన్ మెంట్ భూముల గోల్ మాల్ అంశంపై కొత్తగా కేసు నమోదు చేసి..ఇందులో చంద్రబాబు, నారాయణలను నిందితులుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News