అసెంబ్లీలోచంద్రబాబు రౌడీయిజం..జగన్

Update: 2020-11-30 10:52 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. రైతు సమస్యల అంశంపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదంటూ ఆవేశంతో ఊగిపోయిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అసాధారణ రీతిలో పోడియం వద్ద కింద కూర్చున్నారు. టీడీపీ సభ్యుడు రామానాయుడు మాట్లాడారని..దానికి సమాధానం ఇస్తుంటే మద్యలో చంద్రబాబు జోక్యం చేసుకోవటం సరికాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడే సభలో రౌడీయిజం చేస్తూ..తనకు ఏదో అన్యాయం జరిగిందని చెబుతారంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ నెలాఖరునాటికి ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని సీఎం చెప్పారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని, గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదని జగన్మోహన్ రెడ్ది అన్నారు. చంద్రబాబునాయుడిని డ్రామా నాయుడు అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఎందుకు అంత ఆవేశపడుతున్నారో అర్ధం కావటం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలకు సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. తుపాను పంట నష్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీల మధ్య వివాదం చోటుచేసుకుంది.

Tags:    

Similar News