వరసగా రెండు క్యాబినెట్ భేటీలకు డుమ్మా

Update: 2025-12-30 06:15 GMT

ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ అనధికార సీఎం గా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారులు కూడా అదే మాట చెపుతున్నారు. ఈ తరుణంలో ఆయన మంత్రి వర్గ సమావేశాలను కూడా లైట్ తీసుకుంటున్న తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే మంత్రి నారా లోకేష్ వరసగా రెండు క్యాబినెట్ సమావేశాలకు డుమ్మాకొట్టారు. ఇందుకు కారణం ఆయన విదేశీ పర్యటనలో. క్యాబినెట్ సమావేశాలకు ఒక పవిత్రత ఉంటుంది. అత్యవసరం అయితే...అది కూడా హాజరుకాలేని పరిస్థితులు ఉంటే తప్ప ఎవరూ కూడా క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాకుండా ఉండరు.

                                                    ఇతర మంత్రులు ఇలా చేస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏ మాత్రం ఊరుకోరు. నారా లోకేష్ విషయానికి వచ్చేటప్పటికి అంతా ఆయన ఇష్టారాజ్యంగా మారింది అనటానికి ఇది ఒక ఉదాహరణ అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. డిసెంబర్ 29 న జరిగిన మంత్రి వర్గ సమావేశానికి ఆయన వ్యక్తిగత విదేశీ టూర్ వాళ్ళ డుమ్మా కొట్టారు అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లటాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ ఏకంగా క్యాబినెట్ సమావేశాలను ఎగ్గొట్టి మరీ ఇలా వెళ్ళటం ఏ మాత్రం సరికాదు అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నెలలలోనే మంత్రి నారా లోకేష్ ఒక పార్టీ మీటింగ్ లో పాల్గొనటంతో పాటు పారిశ్రామికవేత్తలతో మీటింగ్ కోసం అని అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా అంటే డిసెంబర్ 11 న మంత్రి వర్గ సమావేశం జరిగింది.

                                                Full Viewఇందులో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి కూడా డుమ్మాకొట్టిన నారా లోకేష్ ఆ మరుసటి రోజే వైజాగ్ లో జరిగిన కాగ్నిజెంట్ తో పాటు ఇతర ఐటి కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాబినెట్ సమావేశానికి డుమ్మాకొట్టి ప్రైవేట్ కంపెనీల ఈవెంట్ కోసం వైజాగ్ లో ల్యాండ్ అయి తన కృషి వల్లే ఇవి అన్నీ వచ్చాయని చెప్పుకునే ప్రయత్నం చేశారు. వరసగా రెండు క్యాబినెట్ సమావేశాలకు మంత్రి నారా లోకేష్ డుమ్మాకొట్టిన వ్యవహారం ఏ మాత్రం మంచి సంకేతాలు పంపదు అని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News