ఎందుకంటే ఆ పార్టీ లో ఆయన పలు సంవత్సరాల పాటు ఉన్న విషయం తెలిసిందే. అధిష్టానం చెప్పే పనులు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయటంలో సత్య కుమార్ కు మంచి పేరు ఉంది అని పార్టీ నేతలు చెపుతున్నారు. ఈ కోణంలోనే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయన్ను కూడా అసెంబ్లీ బరిలో దించాలని నిర్ణయించి ధర్మవరం సీటు కేటాయించారు. ఇవి ఒకెత్తు అయితే బీజేపీ తో పొత్తు పెట్టుకున్న కారణంగా తెలుగు దేశం పార్టీ ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కూడా నిర్ణయం తీసుకోవటానికి మల్లగుల్లాలు పడుతోంది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో తాను కాకుండా తమ కుటుంబం నుంచి మాగుంట రాఘవ బరిలో ఉంటారు అని కొద్ది రోజుల క్రితం మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్నారు అనే కారణం తో రాఘవ బదులు...మరో సారి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కే సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెపుతున్నారు. అంతే కాదు...టీడీపీ కి ఇప్పుడు రఘురామకృష్ణం రాజు సీటు కూడా రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. బీజేపీ కాదన్న ఆయనకు తాము సీటు ఇస్తే బీజేపీ స్పందన ఎలా ఉంటుందో అన్న సంశయం ఆ పార్టీ అధిష్టానంలో ఉంది అనే చర్చ సాగుతోంది. ఆయనకు అసలు సీటు ఇస్తారా...ఇస్తే ఏది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చినా కూడా ఆ పార్టీ ఎజెండా మాత్రం వేరే ఉంది అనే అనుమానాలు టీడీపీ నేతల్లో కూడా ఉన్నాయి. బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ళను టీడీపీ ఎలా అధిగమిస్తుందో చూడాల్సిందే.