వైజాగ్ భూకేటాయింపులు రద్దు !

Update: 2024-10-19 15:32 GMT

Full Viewవైజాగ్ కేంద్రంగా ఉండే స్వరూపనంద స్వామి ఎంత వివాదాస్పదుడో అందరికి తెలిసిందే. రాజకీయ నాయకులు పార్టీలు మారటం సహజం. కానీ స్వరూపానంద స్వామిగా పిలిపించుకునే ఆయన రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోరు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన జగన్ కు తన పూర్తి అండదండలు అందించారు. అందుకు ప్రతిఫలంగా వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని దక్కించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అలా ఓడిపోయిందో లేదో ఆయన స్వరం మారింది. వెంటనే ప్లేట్ ఫిరాయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని ప్రకటించారు. ఈ ప్రకటన చూసి చాలా మంది అవాక్కు అయ్యారు కూడా.

                                                    అంతే కాదు అమరావతి లో కూడా తమ పీఠం అభివృద్ధి చేస్తానని జూన్ పదిన ఒక ప్రకటన చేశారు ఆయన. జగన్ తన రాజకీయ అవసరాలకు అటు స్వరూపానంద స్వామిని...ఇటు పీఠాన్ని బాగానే ఉపయోగించుకున్నారు. బహుశా అందుకేనేమో జగన్ ప్రభుత్వం అలా అడిగారో లేదో భీమిలి బీచ్ రోడ్ లో ఉన్న 15 ఎకరాల భూమిని కేటాయించారు. మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఈ భూమి విలువ 250 కోట్ల రూపాయల పైమాటే. కానీ జగన్ సర్కారు మాత్రం పదిహేను లక్షల రూపాయల కే ఇంత విలువైన భూములను కట్టబెట్టింది. చంద్రబాబు సర్కారు ఈ భూ కేటాయింపులపై అధికారుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకుని..ఇప్పుడు వీటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ స్వామికి చంద్రబాబు సర్కారు షాక్ ఇచ్చినట్లు అయింది అనే చెప్పొచ్చు. 

Tags:    

Similar News