తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కేసు ల కత్తి అలా వేలాడుతూనే ఉంది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్స్ ను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ తోసిపుచ్చింది. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విషయంలో అరెస్ట్ అయి గత నెల రోజులు పైగా రాజమండ్రి జైలు లో ఉన్న విషయం తెలిసిందే. అంగళ్ళు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసు ల విషయంలో చంద్రబాబు కు చుక్కెదురు అయింది. దీంతో హై కోర్ట్ ఈ అంశాలపై బెయిల్స్ రిజెక్ట్ చేయటం కీలక పరిణామంగా మారింది అనే చెప్పాలి. ఇప్పటికే ఈ కేసు ల్లో సిఐడి అధికారులు ఏసిబి కోర్ట్ ను పీటి వారంట్స్ కోసం ఆశ్రయించారు. దీంతో పరిణామాలు అన్ని ఇప్పుడు చంద్రబాబుకు వ్యతికరేకంగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే అటు అంగళ్ళు కేసు అయినా...ఇటు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసు ల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చాలా మంది బెయిల్స్ పై ఉన్నారు.
కానీ ఈ కేసుల్లో విచారణ కీలక దశలో ఉన్నందున చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్స్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్స్ ను కోర్టు కొట్టి వేసింది. ఒక వేళ సుప్రీమ్ కోర్ట్ లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చినా కూడా మరి కొంత కాలం చంద్రబాబు ఈ మూడు కేసు లకు సంబంధించి జైలు లోనే ఉండాల్సి ఉంటుంది అనే అభిప్రాయం న్యాయ నిపుణులు చెపుతున్న మాట. హై కోర్ట్ బెయిల్ పిటిషన్స్ ను రిజెక్ట్ చేసినందున ఏసిబి కోర్ట్ ఇప్పుడు పీటి వారంట్స్ కు అనుమతి మంజూరు చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇది రాజకీయంగా తెలుగు దేశం పార్టీ కి ఒకింత ఇరకాటంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.