ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహుర్తం మారింది. తొలుత ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు అది మార్చి ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9గం.05ని నుంచి 9గం.45ని.మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. ఈ మేరకు కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడింది. 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వర్చువల్‌గా ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఏప్రిల్ 6వ తేదీన వాలంటీర్ల సేవలకు సత్కారంతో పాటు ఏప్రిల్ 8వ వసతి దీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. బుధవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.