ఏపీకి చెందిన సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. తాను గవర్నర్ కు రాసిన లేఖలు బహిర్గతం అవుతాయని..దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మంత్రులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ఎస్ఈసీ తన పిటీషన్ లో ఇద్దరు మంత్రులతోపాటు గవర్నర్ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రతివాదులుగా చేర్చారు. గత కొంత కాలంగా ఏపీ సర్కారు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 31న పదవి విరమణ చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా రమేష్ కుమార్ అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ ఇఫ్పటికే నోటీసులు జారీ చేయగా.. దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు.