పంచాయతీ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక్క ఓటరుతోపాటు ఎవరి కోరినా కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని..ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపైనే ఉంటుందని పేర్కొంది.
కౌంటింగ్ ప్రక్రియ వీడియో తీయాలనే అంశానికి సంబంధించి దాఖలైన పిటీషన్లపై హైకోర్టు మంగళవారం నాడు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పంచాయతీలో ఉండే ఓటరు ఎవరైనా వీడియో షూట్ చేయాలని కోరితే వెంటనే కౌంటంగ్‌ను చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.