ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ ల‌కు జైలు శిక్ష

Update: 2022-03-31 07:02 GMT

క్షమాప‌ణ‌తో ఏడాది పాటు సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆదేశం

ఏపీ హైకోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఐఏఎస్ ల‌కు షాకిచ్చింది. ఏకంగా రెండు వారాల పాటు జైలు శిక్ష విధించ‌టంతో ఐఏఎస్ లు క్షమాప‌ణ చెప్పారు. దీంతో జైలు శిక్షను త‌ప్పించి..వీరంతా ఏడాది పాటు ప్ర‌తి నెల‌లో ఒక రోజు వెల్ఫేర్ హాస్ట‌ల్ లో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి..ఒక రోజు కోర్టు ఖ‌ర్చులు భ‌రించాల‌ని ఆదేశించింది. దీంతో ఐఏఎస్ లు ఊపిరిపీల్చుకున్నారు. కోర్టు ధిక్క‌ర‌ణ కేసు ఎదుర్కొన్న వారిలో సీనియర్ ఐఏఎస్‌లు విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్‌, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌లుఉన్నారు. పాఠ‌శాల‌ల ఆవ‌ర‌ణ‌లో ఎలాంటి ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను నిర్మించ‌కూడ‌ద‌ని తాము ఇచ్చిన ఆదేశాల‌ను ఉల్లంఘించ‌టంతో కోర్టు వీరిపై కోర్టు ధిక్క‌ర‌ణ కింద చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Tags:    

Similar News