మంత్రి నారాయణ...కన్నబాబుల డైరెక్షన్ లోనే సాగిందా?

Update: 2025-03-20 05:30 GMT
మంత్రి నారాయణ...కన్నబాబుల డైరెక్షన్ లోనే సాగిందా?
  • whatsapp icon

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ఏ టెండర్ అయినా కూడా అంచనా విలువ కంటే ఐదు శాతానికి మించి ఉంటే దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఐదు శాతానికి మించిన టెండర్లను అనుమతించరాదు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల లో అక్రమాలను అడ్డుకునేందుకు 2004 నవంబర్ 20 న అప్పటి ప్రభుత్వం ఈ మేరకు జీఓ 133 ని తీసుకొచ్చింది. అన్ని ఇంజనీరింగ్ శాఖలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి...ఆ కమిటీ సూచనలకు అనుగుణంగానే అప్పటిలో ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ కూటమి సర్కార్ మాత్రం ఎంపిక చేసిన కాంట్రాక్టర్ల కోసం ఈ టెండర్ కండిషన్ కు తిలోదకాలు ఇచ్చేసింది. నిబంధనల ప్రకారం ఏ టెండర్ అయినా కూడా అంచనా విలువ కంటే ఐదు శాతం కంటే ఎక్కువ మొత్తం కోట్ చేస్తే దాన్ని రద్దు చేయాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ శాఖ మాత్రం అమరావతి లో తలపెట్టిన వివిధ విద్యుత్ పనులకు సంబంధించిన పనులకు టెండర్లు ఐదు శాతానికి మించి వచ్చినందున ఐదు శాతం పైన వచ్చినా కూడా పనులు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీసిఆర్ డిఏ అథారిటీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు.

                                                       అంటే ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే చేశారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఈ ఐదు శాతం సీలింగ్ నిబంధన వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన కాంట్రాక్టర్ల కోసం ప్రాథమిక దశలోనే అంచనాలను అడ్డగోలుగా పెంచే మోడల్ ను తీసుకొచ్చారు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఏపీసిఆర్ డిఏ పిలిచిన పనులు అన్నిటిని ఐదు శాతం లోపే ఎక్సెస్ కు మాత్రమే అనుమతి ఇచ్చి..ఎంపిక చేసిన పనులు..ఎంపిక చేసిన కంపెనీలకు మాత్రం ఈ నిబంధన మినహాయింపు ఇస్తూ జీవో ఇచ్చారు అంటే ఇది అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం. అందరూ కూడబలుక్కుని చేసినట్లు అర్ధం అవుతోంది అనే చర్చ సాగుతోంది. నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబులు అంచనా విలువ కంటే ఐదు శాతం పైన టెండర్ లు రద్దు చేయకుండా ప్రభుత్వానికి సిఫారసు చేశారు అంటే ఇది అంతా ఒక స్కెచ్ ప్రకారమే సాగింది అనే చర్చ మున్సిపల్ శాఖ లో కూడా ఉంది. ఇప్పుడు ఎంపిక చేసిన పనుల కోసం తీసుకున్న మినహాయింపు రాబోయే రోజుల్లో మరి కొన్నిటికి వర్తింప చేయవచ్చు అని...లేకపోతే మొత్తం ఈ నిబంధన మొత్తానికి ఎత్తేసినా ఆశ్చర్యం లేదు అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

                                                            సిఆర్ డిఏ పనులు ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు ఇతర రుణాల తో చేస్తున్నందున అక్కడ ఇలాంటి వాటికి ఛాన్స్ ఉండదు అని..అందుకే అక్కడ అన్ని పనులకు ఐదు శాతం లోపు అందరూ కూడా బలుక్కుని వేసినట్లు ఉన్నాయి ఆ ఎక్సెస్ రేట్లు. ఇదే బిఎస్ ఆర్ అమరావతి పనుల్లో మాత్రం ఐదు శాతం ఎక్సెస్ లోపు వేసి పనులు దక్కించుకోగా...ఇక్కడ మాత్రం ఏకంగా అంచనా విలువ కంటే 8 .98 శాతం అంటే నికరంగా తొమ్మిది శాతం ఎక్కువ తో 1082 .44 కోట్ల రూపాయల పనులను దక్కించుకుంది. మరో కంపెనీ పీవిఆర్ కన్‌స్ట్రక్షన్స్ కూడా 8 .99 శాతం ఎక్సెస్ తో 390 కోట్ల రూపాయల పనులు దక్కించుకుంది. ఈ రెండు సంస్థలు సిఆర్ డీఏ ప్రాంతంలో వివిధ రకాల విద్యుత్ లైన్ లు...అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు చేయాల్సి ఉంటుంది. ఒకే ప్రభుత్వంలో కొన్ని పనులకు ఒక నిబంధన..మరి కొన్ని పనులకు మరో సీలింగ్ నిబంధన అమలు చేయటం విచిత్రంగా ఉంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Tags:    

Similar News