మాట్లాడాలంటే తెలంగాణ వాళ్లు రావాలి క‌దా?

Update: 2021-07-13 14:54 GMT

జ‌ల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ చ‌ర్య‌ల వ‌ల్ల నీరు స‌ముద్రంలోకి పోయింద‌ని అన్నారు. జ‌ల వివాదంపై ఇద్ద‌రూ కూర్చుని మాట్లాడుకోవాల‌ని చెబుతున్నారని..మాట్లాడ‌టానికి తెలంగాణ నుంచి ఎవ‌రైనా ముందుకు రావాలి క‌దా? అని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ భ‌విష్య‌త్ లో ఇలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. వ‌ర్షాల ప‌డ‌క‌పోతే రాయ‌ల‌సీమ ప్రాంతానికి అన్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ జల అక్రమాలపై మాట్లాడని చంద్రబాబు నాయుడు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని విమ‌ర్శించారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారన్నారు.

                                     అసలు తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.పంచాయతీల గొంతు నొక్కింది చంద్రబాబేనని, ఆయన హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారన్నారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా బాబు ఎన్‌జీటీలో కేసులు వేయించారని ధ్వజమెత్తారు. సీమ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖలు రాయించారని, పుట్టిన ప్రాంతం, రాష్ట్రంపై బాబుకు ప్రేమ లేదని మండిపడ్డారు. ఆర్ధిక ఖ‌ర్చుల‌ను తాము ఎక్క‌డా దాయ‌టంలేద‌ని చెప్పారు. చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల వ‌ల్లే కేంద్రం రుణ ప‌రిమితిలో కోత విధించింద‌ని అన్నారు.

Tags:    

Similar News