కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఏపీ సర్కారు థియేటర్లకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండాలని ఆంక్షలు విధించింది. ఈ లెక్కన 50 శాతం సామర్ధ్యంతో అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. కరోనా ప్రొటోకాల్స్‌తో ఇతర వ్యాపార కార్యకలాపాలు కూడా సాగించుకోవచ్చన్నారు. శానిటైజర్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది.
తాజాగా చేసిన కర్ఫ్యూ నిబంధనల మార్పు ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.