ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ నుంచి సిట్‌కు విచారణ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. 16 మందితో ఈ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి జీవీజీ ఆశోక్ కుమార్, ప్రస్తుతం ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న జీవీజీ ఆశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబులను నియమించింది.
ఆలయాలపై దాడులకు సంబంధించి అన్ని కేసులను సిట్ విచారించనుంది. రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా సాగుతున్న దాడులను లోతుగా సిట్ పరిశీలించనుంది. నిపుణుల కమిటీ సేవలను ఉపయోగించుకుని మరీ దోషులను గుర్తించనున్నారు.