జగన్ సర్కారు మరో కీలక అంశంలో రివర్స్ గేర్ వేసింది. లిక్కర్ బాండ్స్ ద్వారా నిధులు సమీకరించిన సర్కారు మద్య నిషేధం ఉసెత్తమని ఈ బాండ్స్ బాధ్యతలు చూసిన వారికి బాండ్ రాసి ఇచ్చింది. పాక్షికంగా అయినా..పూర్తిగా కూడా అసలు మద్య నిషేధం ఉండదని ప్రకటించింది. ఒక వేళ నిషేధం అమలు చేయాల్సి వస్తే..అది అమల్లోకి వచ్చినప్పటి నుంచి మూడు నెలల్లో ఈ బాండ్స్ ను ఉపసంహరించుకోవటానికి అనుమతి మంజూరు చేసింది. అంటే ఈ లెక్కన ఏపీలో మద్య నిషేధం అన్న ఊసే ఉండదు.
గతంలో జగన్ తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని..కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు..మద్యంపై ప్రభుత్వం ఆధారపడటమా అంటూ ఎద్దేవా చేశారు. తర్వాత దశల వారీ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు బాండ్స్ ద్వారా అప్పులు తెచ్చుకోవటానికి వీలుగా అసలు ఆ ఛాన్సే లేదని తేల్చేశారు.