మాట మార్చాక అదే మాటపై కట్టుబడి ఉన్న జగన్

Update: 2023-01-31 11:11 GMT

ముఖ్యమంత్రి ఆయనకు నచ్చిన చోట కూర్చోవచ్చు. ఎక్కడ నుంచి అయినా పాలనా చేయవచ్చు. కానీ సీఎం జగన్ వైజాగ్ వెళ్లి కూర్చోగానే అది రాజధాని ఎలా అవుతుంది. విశాఖపట్నం రాజధాని కావాలంటే ముందు సుప్రీమ్ కోర్ట్ లో ఉన్న కేసు తేలాలి. అది తేలక ముందు ప్రభుత్వం మూడు రాజధానులపై మరో బిల్లు పెట్టే అవకాశం లేదు. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ మాత్రం అమరావతే రాజధాని అని స్పష్టంగా చెప్పింది. కాదు కూడదు అంటే సవరణ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది తప్ప అసెంబ్లీ ఒక సారి ఒక రాజధానిని ఖరారు చేశాక మరో సారి ఇదే అంశంపై బిల్లు పెట్టడం సాధ్యం కాదు అని తన తీర్పులో వెల్లడించింది. చాలా టైం తీసుకుని మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీం కోర్ట్ కు అప్పీలుకు వెళ్ళింది. తొలుత అమరావతికి ఓకే చెప్పిన జగన్ తర్వాత అకస్మాత్తుగా అసెంబ్లీ మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తి అమరావతిని శాసన రాజధాని, కర్నూల్ ను న్యాయ రాజధాని, విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అంటే సచివాలయంతో పాటు పరిపాలనా అంత అక్కడ నుంచే సాగించాలని ప్రతిపాదించారు.

                                        Full Viewరాజధానికి భూములు ఇచ్చిన రైతులు కోర్ట్ కి ఎక్కటం హై కోర్ట్ తీర్పు తెలిసిన విషయాలే. అప్పటినుంచే జగన్ కాబినెట్ లోని మంత్రులు వైజాగ్ ఇదుగో రాజధాని, అదుగో రాజధాని అంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఢిల్లీలో సీఎం జగన్ కూడా ఇదే మాట చెప్పారు. విశాఖపట్నం మా రాజధాని కాబోతుంది. కొన్ని నెలల్లో తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవబోతున్నట్లు ప్రకటించారు. అయన కోసం క్యాంపు ఆఫీస్ కూడా ఎప్పటినుంచో సిద్ధం అవుతుంది. కానీ చట్టబద్ధ ప్రక్రియ ఇంకా ఏమి పూర్తికాకుండా సీఎం జగన్ వైజాగ్ లో కుర్చున్నంత మాత్రాన అది రాజధాని కాదు అని ఒక సీనియర్ ఐఏఎస్ వెల్లడించారు. దీనికి ముందు పూర్తి కావాల్సిన ప్రాసెస్ ఇంకా చాలా ఉంది అన్నారు. జగన్ వైజాగ్ పరిపాలన రాజధాని అని మాట మార్చినప్పటి నుంచి అదే మాటమీద ఉన్నారు. ఇప్పుడు అందులో అయన చెప్పిన కొత్త విషయం ఏమిలేదు. కొద్దినెల్లల్లోనే తాను కూడా షిఫ్ట్ అవుతాను అన్న మాట తప్ప.

Tags:    

Similar News