ఏపీ కేబినెట్ నిర్ణ‌యాలు

Update: 2021-08-06 16:33 GMT

రాష్ట్రంలో ప్రతి తరగతిలో తెలుగు మాధ్యమం తప్పనిసరితుగా ఉంటుందని మంత్రి పేర్ని నాని వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో ఒకే పుస్త‌కం ఒక ప‌క్క ఇంగ్లీష్‌, మ‌రోప‌క్క తెలుగు పాఠాలు ఉంటాయ‌న్నారు. ఈ త‌ర‌హాలో పుస్త‌కాలు ఇవ్వ‌బోతున్న రాష్ట్రం ఏపీనే అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నాడు-నేడు కింద స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని మంత్రి పేర్నినాని అన్నారు. రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని, మెరుగైన విద్య అందించాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్షని పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశంజరిగింది. ఆ త‌ర్వాత మంత్రివ‌ర్గంలో తీసుకున్న నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. '' రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకబడకూడదనేదే సీఎం లక్ష్యం. మంచి విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారు. ఈనెల 16న విద్యాకానుక అందిస్తాం. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన..3 లక్షల 40 వేలమంది అగ్రిగోల్డ్‌ బాధితులకి డబ్బు అందించాం.

ఈనెల 24న రూ.10వేల నుంచి 20 వేల లోపు డిపాజిట్‌ చేసిన.. అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు పంపిణీ చేస్తాం. ఇకపై కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ. అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షలు ఇస్తాం. పులిచింతల 16వ గేట్‌ అంశం కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చింది. మెకానికల్‌ ఫెయిల్యూర్‌ వల్ల గేట్‌ కొట్టుకుపోయినట్లు ప్రాథమిక నిర్థారణ అయింది. మాన్యువల్‌ ఆపరేటెడ్‌ గేట్లు కాకుండా.. హైడ్రాలిక్‌ గేట్ల ఏర్పాటుపై అధ్యయం చేయాలని.. సచివాలయాలకు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఉండాలని కేబినెట్‌ ఆదేశించింది. నెలలో 12 రోజులపాటు ఎమ్మెల్యేలు సచివాలయాల సందర్శించాల‌ని సూచించింది'అని తెలిపారు.

అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని అక్రమణల క్రమబద్ధీకరణ చేయాల‌ని నిర్ణ‌యించారు. అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్దీకరణ. 300 చదరపు గజాల వరకూ రెగ్యులరైజేషన్ చేస్తారు. 75 చదరవపు గజాల వరకూ అడుగుల వరకూ భూమి బేసిక్‌ వాల్యూలో 75శాతం రుసుముతో రెగ్యులరైజేషన్‌. ఒకవేళ లబ్ధిదారుడు కేటగిరీ–1కు చెందిన వారైతే వారికి ఉచితంగా పట్టా, డి ఫారం పట్టా పంపిణీ. 75 నుంచి 150 చదరపు గజాల వరకూ భూమి బేసిక్‌వాల్యూలో 75శాతం రుసుముతో రెగ్యులరైజేషన్‌. 150 నుంచి 300 చదరపు గజాలవరకూ భూమి బేసిక్‌ వాల్యూలో 100శాతం రుసుముతో రెగ్యులరైజేషన్‌

ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి అమలు. అక్టోబరు 15, 2019 నాటివరకూ ఉన్న వాటికి క్రమబద్ధీకరణ. మాస్టర్‌ ప్లాన్, జోనల్‌డెవలప్‌ మెంట్, రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో ప్రభావితమైన భూములకు వర్తించదుఅని తెలిపారు.

Tags:    

Similar News