పీఆర్సీ విషయంలో ఏపీ సర్కారు తన వైఖరిని ఏ మాత్రం మార్చుకునే ఉద్దేశంతో లేదు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలసి ఉమ్మడిగా పోరాటానికి సిద్ధం అవుతున్నా శుక్రవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు, పీఆర్సీ జీవోలకు ఆమోదముద్ర వేశారు. అదే సమయంలో ఉద్యోగుల ఆందోళనలు తొలగించేందుకు..వారికి నచ్చచెప్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్ లలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.టౌన్‌షిప్‌ల్లో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబెట్ తో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పిన మంత్రి.. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు నగదు చెల్లింపు ఉంటుందన్నారు. మంత్రివర్గం ఆమోదించిన ఇతర అంశాలు...
ఈబీసీ నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం
ఈనెల 25న ఈబీసీ నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం
16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
వైద్య కళాశాలలకు రూ, 7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం
ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాల్లో ఓటీఎస్ చెల్లించేలాలో స్వల్ప మార్పులు
రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు
ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు చెల్లింపు
కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం
అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం
ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం
కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం