బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Update: 2021-03-26 08:10 GMT

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఏపీ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తోంది. అందుకే తాత్కాలిక బడ్జెట్ ను ఆర్డినెన్స్ రూపంలో ఆమోదింపచేసుకోవాలని నిర్ణయించింది. 90 వేల కోట్ల రూపాయలతో మూడు నెలలగాను ప్రతిపాదించిన తాత్కలిక బడ్జెట్ కు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. గవర్నర్ ఆమోదం లాంఛనమే కానుంది. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆర్డినెన్స్ ను ఆమోదిస్తేనే ఏప్రిల్ 1 నుంచి ఖజానా నుంచి నిధులు వాడుకోవటానికి అనుమతి లభిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ ఆమోదించుకుంటున్న తీరును టీడీపీ తప్పుపడుతోంది.

Tags:    

Similar News