ఏపీ బిజెపి వివాదస్పద వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ఏపీ బిజెపి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం జగన్ ను రమణదీక్షితులు విష్ణుమూర్తితో పోల్చటంపై రాజకీయ దుమారం రేగింది. ఈ పోలికపై పలువరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ బిజెపి తన అధికారిక పేస్ బుక్ పేజీలో తీవ్రపదజాలంతో విమర్శలు గుప్పించింది.
'హిందూ వ్యతిరేక కుటుంబం బూట్లు నాకుతూ, టీటీడీ ప్రధాన అర్చక పదవికి ఉన్న విలువను పోగొట్టారు రమణ దీక్షితులు. బెయిల్ మీదున్న ముఖ్యమంత్రి (వేంకటేశ్వరుని సైతాన్ అని పిలిచే పాస్టర్లను పోషిస్తున్న) ని విష్ణువుతో పోల్చటం ద్వారా, దేవుడితో పాటు, కోట్లాది మంది భక్తులను అవమానపరచారు.' అని పోస్ట్ పెట్టారు.