పెగాసెస్ పై ఏపీ అసెంబ్లీ స‌భా సంఘం

Update: 2022-03-21 11:52 GMT

ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు పెగాసెస్ చుట్టూ తిరుగుతున్నాయి. గ‌త కొంత కాలంగా ఇదే అంశంపై అధికార వైసీపీ టీడీపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతోంది. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాల్సిందిగా త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చార‌ని..అయితే తాము దీన్ని తిర‌స్క‌రించిన‌ట్లు తెలిపారు. అప్ప‌టి ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు మాత్రం పెగాసెస్ కొన్నార‌ని ఆమె స్వ‌యంగా అసెంబ్లీలో చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి దీనిపై దుమారం రేగుతోంది. అయితే తాజాగా ఈ వ్య‌వ‌హారంపై ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.

పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. పెగాసెస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గతంలో మాజీ డీజీపీ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద దాఖ‌లు చేసిన ద‌ర‌ఖాస్తులో సవాంగ్ స్పష్టం చేసిన‌ట్లు టీడీపీ చెబుతోంది. అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌భా సంఘంపై ప్ర‌క‌ట‌న చేస్తూ దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను మంగ‌ళ‌వారం లేదా బుధ‌వారం నాడు ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

Tags:    

Similar News