దమ్మాలపాటి శ్రీనివాస్. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు. ఈ సారి మాత్రం ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అది కూడా తెలుగు దేశం అభిమానుల నుంచే. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా లో దమ్మాలపాటి శ్రీనివాస్ పై పెద్ద ఎత్తున ప్రతికూల ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఏకంగా కొంత మంది ఆయనపై పుస్తకాలు కూడా వేసి ప్రచారంలో పెట్టారు. ముఖ్యంగా పలు విషయాల్లో ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారు అంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశాయి. కారణాలు ఏమైనా కూడా మరి కొద్ది రోజుల్లో ..లేదంటే కొత్త సంవత్సరంలోగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దమ్మాలపాటి శ్రీనివాస్ స్థానంలో కొత్త అడ్వకేట్ జనరల్ ను నియమించే అవకాశం ఉంది అని టీడీపీ వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఫస్ట్ టైం ఈ నియామకం సమయంలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి ..మంత్రి నారా లోకేష్ అభ్యంతరం చెప్పారు అని..కానీ చంద్రబాబు మాత్రం రకరకాల కారణాలతో ఆయన్ను ఈ పోస్ట్ లో నియమించినట్లు టీడీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం లో ఉంది. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త ఏజీని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెపుతున్నారు. ఈ పదవి నుంచి తప్పుకోవడానికి దమ్మాలపాటి కూడా సిద్ధంగా ఉన్నారు అని...అయితే గౌరవప్రదంగా పక్కకు వెళ్లేందుకు వీలుగా తనకు రాజ్య సభ లేదు అంటే కనీసం ఎమ్మెల్సీ సీటు అయినా ఇవ్వాలని ఆయన కోరినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ మరి ఈ విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తెలుగు దేశం పార్టీ గతంలో టీడీపీ లీగల్ సెల్ బాధ్యతలు చూసిన కనకమేడల రవీంద్ర కుమార్ ను రాజ్య సభకు పంపింది. అలాగే తనను కూడా ఏదో ఒక చట్టసభకు పంపించాలని కోరుతున్నట్లు చెపుతున్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ ను ఏజీ పదవి నుంచి తప్పిస్తే తదుపరి ఈ ఛాన్స్ సీనియర్ అడ్వకేట్ ఉన్నం మురళీధర్ రావు , పి.రఘురామ్ ల్లో ఒకరికి దక్కొచ్చు అని చెపుతున్నారు. అయితే ఉన్నం మురళీధర్ రావు మంత్రి నారా లోకేష్ కు ఎంతో సన్నిహితుడు అని...దీంతో ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది.