అద్దెకు విజయవాడ విమానాశ్రయం..ఏభై ఏళ్ళు

Update: 2022-12-08 14:02 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ విమానాశ్రయాన్ని కేంద్ర లీజ్ కు ఇవ్వబోతోంది. అది కూడా 50 ఏళ్ళ కాలానికి. విజయవాడ తో పాటు దేశంలోని మొత్తం పదకొండు విమానాశ్రయాలను లీజ్ కు ఇచ్చేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇవి అన్ని కూడా ప్రస్తుతం ఏవియేషన్ ఆథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ ) చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఏఏఐ చేతిలో ఉన్న ఈ విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి అతి తక్కువ మొత్తం లో యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్ ) వసూలు చేస్తారు. అదే ఇప్పుడు ఇవి అన్ని లీజ్ కు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళితే ప్రయాణికులపై భారం పడటం ఖాయం. కొత్తగా లీజ్ కు ఇవ్వనున్న వాటిలో చెన్నై, కోల్ కతా, జబల్ పూర్, ఇండోర్, రాజకోట్, విజయవాడ, రాయపూర్, అమృతసర్ లు ఉన్నాయి.

                                     దీనికి సంబదించిన పనులు సాగుతున్నాయని,,,త్వరలోనే దీనిపై టెండర్ల జారీ ప్రకటన వింటారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇలా లీజ్ కు ఇచ్చిన విమానాశ్రయాల ద్వారా వచ్చిన మొత్తాలను ద్వితీయ, తృతియ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉపయోగిస్తామన్నారు. ఈ విమానాశ్రయాలను లీజ్ కు ఇవ్వటం ద్వారా అప్ ఫ్రంట్ కింద 8000 కోట్ల రూపాయలు వస్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద ఆస్తుల నగదీకరణ కింద 20000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 లో కేంద్రం ఆరు విమానాశ్రయాలను లీజ్ కు ఇవ్వగా అన్ని అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో లక్నో, అహ్మదాబాద్, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురం ఉన్నాయి.

Tags:    

Similar News