ప్రధాని మోడీ పర్యటన కోసం అంటూ ప్రస్తావన

Update: 2025-04-12 06:07 GMT
ప్రధాని మోడీ పర్యటన కోసం అంటూ ప్రస్తావన
  • whatsapp icon

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎలాంటి హంగామా లేకుండా ఈ సారి అయినా అమరావతి పనులు వేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తోలి టర్మ్ లో అంటే 2014 -2019 కేవలం భారీ భారీ సినిమాలు చూపించి అసలు పనులు వదిలేయటం వల్లే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టే ఛాన్స్ ఇచ్చినట్లు అయింది. ఇదే అభిప్రాయం చాలా మంది టీడీపీ నేతల్లో కూడా ఉంది . ప్రస్తుతం పనులు అయితే కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇవి మొదలు అయ్యాయి కూడా. అయితే చంద్రబాబు నాయుడు తనకు అలవాటు అయిన పద్ధతి ప్రకారం దగ్గర దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెట్టి త్రీ డీలో సినిమా చూపించటానికి రెడీ అయ్యారు. ఒక వైపు నిధుల సమస్య ఉంది అని చెప్పి..రాష్ట్రం అప్పుల ఊబిలో కురుకుపోయింది అంటూ కూడా ఈ సినిమాలు చూపించటం మాత్రం మానటం లేదు. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం సిద్ధం చేయాలని నిర్ణయించటం విశేషం.

                                                              ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసి ) 3 డీ మోడల్ ను సిద్ధం చేయటానికి టెండర్లు పిలిచారు. ఈ 3 డీ మోడల్ ను ప్రధాని పర్యటన సందర్భంగా ప్రదర్శించనున్నట్లు అణుడిలో పేర్కొన్నారు. దీంతో పాటు అమరావతి ఎక్స్పీరియన్స్ సెంటర్ లో రాజధాని కాన్సెప్ట్ ను అద్భుతమైన టెక్ ఎక్సిబిషన్ ద్వారా చూపించేందుకు కూడా రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ జారీ చేశారు. అయితే దీనికి ఎంత వ్యయం అన్నది మాత్రం చూపించలేదు. చంద్రబాబు తన తొలి టర్మ్ లో అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒక జాతీయ మీడియా సంస్థకు ఏకంగా 40 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చి ఒక మెగా ఈవెంట్ లాగా చేయాలనుకుంటే అప్పటిలో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఆయన ఆఫీస్ ఈ ఈవెంట్ ఖర్చుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో అప్పటిలో ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. కానీ ఈ సారి మాత్రం కోటి రూపాయల ఖర్చుతో మాత్రం 3 డీ సినిమా కు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News