క్షమాపణకు ప్రశాంత్ భూషణ్ నో

Update: 2020-08-20 16:42 GMT

కోర్టు ధిక్కార ఆరోపణల విషయంలో దోషిగా పేర్కొన్న ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పటానికి నిరాకరించారు. తాను క్షమాపణ చెపితే కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో ఆలోచించుకోవటానికి ఆయన కొంత సమయం ఇచ్చింది. సుప్రీంకోర్టు తాను దిక్కారానికి పాల్పడ్డానని దోషిగా నిర్దారించడం బాద కలిగించిందని ఆయన అన్నారు.

తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశాలను, లక్ష్యాన్ని అర్దం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రశాంత భూషణ్ కు శిక్ష విదించవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ సూచించారు. అయితే ప్రశాంత భూషణ్ తరపున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే వాదించారు.దర్మాసనం మారాలన్న వారి వాదనను బెంచ్ లోని న్యాయమూర్తులుఅంగీకరించలేదు.

Similar News