ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Update: 2024-04-27 13:13 GMT

Full Viewఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన కల్కి 2898 ఏడి సినిమా విడుదలకు సంబంధించి కొత్త తేదీ ఫిక్స్ అయింది. ముందు ప్రకటించిన దాని ప్రకారం అయితే మే 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఎన్నికలు, ఐపీఎల్ తో పాటు వివిధ కారణాలతో చిత్ర యూనిట్ సినిమా విడుదలను వాయిదా వేసి..ఇప్పుడు జూన్ 27 న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ , దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, అమితా బచ్చన్ లు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

                                    భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో హీరో ప్రభాస్ భైరవ గా కనిపించనున్నారు. కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించింది. ఇటీవలే అమితాబచ్చన్ కు సంబంధించిన అశ్వత్థామ లుక్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ నడిచిన సలార్ సినిమా సూపర్ హిట్ కావటంతో ఆయన ఫ్యాన్స్ కల్కి సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం దర్శకుడు నాగ్ అశ్విన్ అనే చెప్పాలి. 

Tags:    

Similar News