ముంబై లో ఎన్టీఆర్ ఫోన్ మాట్లాడుతూ ఒక హోటల్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్స్ వెంటపడగా..ఆయన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనబడనున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. తొలి భాగం దసరా కు అంటే అక్టోబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దేవర సినిమా తోనే బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.