కరోనా పుట్టిల్లు చైనాలో కొత్త కలకలం

Update: 2020-04-06 10:46 GMT

లక్షణాలు కన్పించకుండానే కరోనా కేసులు

కరోనాకు పుట్టిల్లు అయిన చైనాలో ఈ కేసుల కలకలం వీడటం లేదు. ఇప్పుడు అక్కడ ఓ ప్రమాదకర పరిస్థితి కన్పిస్తోంది. అసలు కరోనా లక్షణాలు ఏమీ పైకి కన్పించకోయినా పరీక్షల్లో మాత్రం కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం అంతా సోకిన ఈ మహమ్మారి చైనాలో చాలా వరకూ తగ్గుముఖం పట్టిందని..అక్కడ చాలా వరకూ ఆంక్షలు కూడా తొలగించారు. గత వారం నుంచి మళ్ళీ చైనాలో కరోనా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. శని, ఆదివారాల్లోనే అక్కడ ఏకంగా అరవైకి పైగా కొత్త కేసులు వచ్చాయి. అయితే అందులో కరోనా కేసుల లక్షణాలేమీ కన్పించకుండానే ఇతర సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన వారికి చేసిన పరీక్షల్లో ఈ లక్షణాలు వెల్లడయ్యాయి.

కరోనా లక్షణాలు లేకుండా నిర్ధారణ అయిన కేసులు 78 వరకూ ఉన్నట్లు చైనా జాతీయ ఆరోగ్య మిషన్ తెలిపింది. హుబే ప్రాంతం నుంచే ఇతర ప్రాంతాలు ఈ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వైరస్ లక్షణాలు గుర్తించిన 750 మందిని ఓ చోట ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వెలుగులోకి వచ్చాక చైనాలో ఇప్పటివరకూ 81,708 కేసులు రాగా..అందులో 3330 మంది మరణించినట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. కానీ అనధికారిక అంచనాల ప్రకారం చైనాలో కేసుల సంఖ్య, మృతుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.

 

Similar News