కరోనాపై పోరుకు రిలయన్స్ విరాళం 500 కోట్లు

Update: 2020-03-30 15:59 GMT

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనాపై పోరుకు భారీ మొత్తం విరాళం ప్రకటించింది. పీఎం కేర్స్ నిధికి 500 కోట్ల రూపాయలు అందించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5కోట్లు, గుజరాత్ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్లు చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో రెండు వారాల్లో కరోనా వైరస్ బాధితుల కోసం 100 పడకలతో ప్రత్యేకంగా ఒక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలియచేసింది.

పది లక్షల మందికి అన్నదానం చేయాలని ,ఆరోగ్య కార్యకర్తలకు లక్ష మాస్కులు ఇస్తామని కూడా తెలిపింది. దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు అన్నీ కూడా పీఎం కేర్స్ కు భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. తొలుత రిలయన్స్ ఇండస్ట్రీస్ నేరుగా సహాయక కార్యక్రమాలకే మొగ్గుచూపింది. ఇప్పుడు మాత్రం 500 కోట్ల రూపాయల విరాళాన్ని అందించటానికి ముందుకొచ్చింది.

 

 

Similar News