ఎల్ఐసిలో వాటాల ఉపసంహరణ

Update: 2020-02-01 10:13 GMT

పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత జీవిత భీమా సంస్థ (ఎల్ఐసి)లో వాటాలను సంహరించుకోనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. బడ్జెట్ ప్రకటన సందర్భంగా ఆమె ఈ విషయం తెలిపారు. ఎయిర్‌ ఇండియాలో వంద శాతం వాటాలను విక్రయించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీని లిస్టింగ్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే బ్యాంకు డిపాజిట్‌ దారులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. డిపాజిట్‌ దారులకు ఇచ్చే బీమాను రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు.

Similar News