ఎల్లా...తొలి కృత్రిమ మేథ పోలీస్ ఆఫీసర్ ను చూశారా?!

Update: 2020-02-13 05:32 GMT

ఆమె పేరు ఎల్లా. కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో తొలి పోలీస్ ఆఫీసర్. ఎక్కడ అనుకంటున్నారా?. న్యూజిలాండ్ లో. అక్కడి పోలీసులు ఈ అసాదారణ కొత్త ఆఫీసర్ కు అప్పుడే బాధ్యతలు కూడా అప్పగించటానికి రెడీఅయిపోయారు కూడా. ఈ ఏఐ పోలీస్ ఆఫీసర్ అయిన ఎల్లా పోలీస్ స్టేషన్ కు వచ్చే వ్యక్తులతో ముఖాముఖి మాట్లాడుతుంది. వర్చువల్ అసిస్టెంట్ తరహాలో సేవలు అందిస్తుంది..అది కూడా దయార్ధ హృదయంతో స్పందిస్తుంది. వచ్చే సోమవారం నుంచి ఎల్లా తన సేవలు అందించనుంది. వెల్లింగ్ టన్ లోని ఫోర్స్ జాతీయ హెడ్ క్వార్టర్స్ లోని లాబీలో ఎల్లాకు విధులు అప్పగించారు.

భవనంలోకి వచ్చే అతిథులకు స్వాగతం పలకటంతోపాటు సిబ్బందికి లోపలికి వచ్చిన వారి వివరాలు కూడా తెలియజేస్తుంది. కొన్ని అంశాలపై సందర్శకులతో మాట్లాడుతుంది. మూడు నెలల పనితీరును మదింపు చేసిన తర్వాత ఎల్లా భవిష్యత్ ను పోలీసులు మదింపు చేయనున్నారు. ఎల్లా సామర్ధ్యాలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంటాయని..రాబోయే రోజుల్లో మరింత మేథా శక్తి, సామర్ధ్యాలను జోడించే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కృత్రిమ మేథ ఎన్ని సంచలనాలకు కేంద్రం అవుతుందో వేచిచూడాల్సిందే.

 

 

 

 

 

Similar News