అంచనా వ్యయం మూడు లక్షల కోట్లు

Update: 2024-04-28 16:00 GMT

Full Viewడిజైన్లకు దుబాయ్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ ఆమోదం 

దుబాయ్ మరో రికార్డు క్రియేట్ చేయటానికి సిద్ధం అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ ఈ ఎడారి దేశంలో అందుబాటులోకి రానుంది. ఇది పరిమాణంలో ఎంత పెద్దగా ఉంటుంది అంటే...ప్రస్తుతం ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ కు ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో ఇది నిర్మితం కానుంది. అంతే కాదు...ఈ ఎయిర్ పోర్ట్ లో ఏకంగా 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్స్ , ఐదు సమాంతర రన్ వే లు ఉంటాయి. దుబాయ్ దక్షిణం వైపు ఈ కొత్త ఎయిర్ పోర్ట్ తో పాటు కొత్త నగరం కూడా నిర్మితం కానుంది. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ ను దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ పాలకుడు అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

                                       అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ విస్తరణ పూర్తి అయితే ఇక్కడ నుంచి ఏటా 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ అని కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ బిల్డింగ్స్ ప్లాన్స్ కు దుబాయ్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదించారు. వీటిని ఆదివారం నాడు మీడియా కు కూడా విడుదల చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్ దుబాయ్ నిరంతర..స్థిరమైన అభివృద్ధితో పాటు భవిష్యత్ తరాలకు...వాళ్ళ పిల్లలకు కూడా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా రెడీ అయిన తర్వాత ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయంలో సేవలు నిలిపివేస్తారు. అయితే ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొత్త విమానాశ్రయానికి మారటానికి పదేళ్లు పట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News